Prashant Kishor: 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఇక్కడే సీఎంపై బూటు విసిరాడు.. అందుకే ఈ పరిస్థితి: ప్రశాంత్ కిశోర్

‘‘జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే బెతియా పట్టణం ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్థమా ఉన్నవారు ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిపై ఒకరు బూటు విసిరేశారు. అందుకే ఆగ్రహంతో ఇక్కడ రోడ్లు వేయడం లేదు. బూటు విసిరిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. కానీ, ఇక్కడ ప్రజలంతా శిక్షను అనుభవిస్తున్నారు’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

Prashant Kishor: 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఇక్కడే సీఎంపై బూటు విసిరాడు.. అందుకే ఈ పరిస్థితి: ప్రశాంత్ కిశోర్

Nitish Kumar Asked Me To Lead His Party says Prashant Kishor

Prashant Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం దేశ వ్యాప్త పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన ‘జన్‌ సురాజ్‌’ ప్రచారంలో భాగంగా ఆయన యాత్ర 3,500 కిలో మీటర్ల మేర ఉంటుంది. బిహార్ లోని తూర్పు చంపారన్‌ జిల్లా నుంచి ఈ పాదయాత్ర అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. ఇందులో తాజాగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం బిహార్ ముఖ్యమంత్రిపై ఓ వ్యక్తి బూటు విసిరిన ఘటనను గుర్తుచేశారు.

‘‘జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే బెతియా పట్టణం ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్థమా ఉన్నవారు ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిపై ఒకరు బూటు విసిరేశారు. అందుకే ఆగ్రహంతో ఇక్కడ రోడ్లు వేయడం లేదు. బూటు విసిరిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. కానీ, ఇక్కడ ప్రజలంతా శిక్షను అనుభవిస్తున్నారు’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

ప్రశాంత్ కిశోర్ విమర్శలను జేడీయూ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం లేదని జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి అఫ్తఖ్ అహ్మద్ ప్రశ్నించారు. చాలా కాలంపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..