ఇండియన్ సినిమా హిస్టరీలో డిఫరెంట్ పాయింట్‌తో ‘ప్లే బ్యాక్’..

ఇండియన్ సినిమా హిస్టరీలో డిఫరెంట్ పాయింట్‌తో ‘ప్లే బ్యాక్’..

Play Back: బడ్జెట్‌ని బట్టి చిన్న సినిమా, పెద్ద సినిమా అంటుంటాం కానీ నిజానికి ప్రేక్షకులను ఆకట్టుకునేది మంచి సినిమానే.. పాత కథని కొత్తగా చెప్పడం, కొత్త కథని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలగడం ఇంపార్టెంట్ అంటుంటారు ఫిల్మ్ మేకర్స్.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో పాటు సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రానికి ఇంటిలిజెంట్ కథనందించిన హరి ప్రసాద్ జక్కా అలాంటి మరో డిఫరెంట్ అంట్ క్రియేటివ్ ఐడియాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నారు.

Play Back

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, ‘మల్లేశం’ సినిమాతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ప్లే బ్యాక్’.. ఈ పాయింట్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడూ రానిది అని, ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కథా వస్తువు అవుతుంది అని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటుగా ‘క్రాస్ టైం కనెక్షన్’ అనే సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా మేకర్స్ చెప్తున్నారు.

Play Back

మూవీ ‘ప్లే బ్యాక్’ మార్చి 5న రిలీజ్ అవుతోంది. అర్జున్ కళ్యాణ్, స్పందన, మూర్తి, టీఎన్ ఆర్, చక్రపాణి, అశోక్ వర్ధన్, కార్తికేయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించారు.