కనెక్షన్ లేని ఫోన్‌కి కాల్ వస్తే.. ఇంట్రెస్టింగ్‌గా ‘ప్లే బ్యాక్’ ట్రైలర్..

కనెక్షన్ లేని ఫోన్‌కి కాల్ వస్తే.. ఇంట్రెస్టింగ్‌గా ‘ప్లే బ్యాక్’ ట్రైలర్..

Play Back Movie: బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో పాటు సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రానికి ఇంటిలిజెంట్ కథనందించిన హరి ప్రసాద్ జక్కా అలాంటి మరో డిఫరెంట్ అంట్ క్రియేటివ్ ఐడియాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నారు.

Play Back

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, ‘మల్లేశం’ సినిమాతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో ‘ప్లే బ్యాక్’ అనే మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు రిలీజ్ చేశారు.

https://10tv.in/play-back-movie-releasing-on-5th-march-2021/

ఇండియాస్ ఫస్ట్ క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీ ఇదని ట్రైలర్ ద్వారా చెప్పారు. సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికరంగా ఉంది ట్రైలర్.. దర్శకుడు బలమైన పాయింట్ చెప్పబోతున్నాడని అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మార్చి 5న ‘ప్లే బ్యాక్’ రిలీజవుతోంది.