PM Kisan Alert : పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే.. నెలాఖరులోగా ఆ పని చేయాల్సిందే

పీఎం కిసాన్ లబ్దిదారులకు ముఖ్యమైన అలర్ట్. జులై నెలాఖరులోగా ఆ పని చెయ్యకపోతే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.(PM Kisan Alert)

PM Kisan Alert : పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే.. నెలాఖరులోగా ఆ పని చేయాల్సిందే

PM Kisan Alert : పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.6వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలువురు రైతులు ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో ఈ పథకం లబ్ది పొందలేకపోతున్నారు. ఈ-కేవైసీ చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.

ఈ-కేవైసీ చేసుకునే ప్రాసెస్..
* pmkisan.gov.in వెబ్ సైట్ కి వెళ్లి E-KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.
* రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేసి..
* సబ్మిట్ నొక్కితే సరిపోతుంది.

PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..

సక్సెస్ ఫుల్ అని వస్తే సమస్య లేదు. అలా కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ రైతులు ఈకేవైసీ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి కచ్చితంగా ఆధార్ కార్డుని వెంట తీసుకుని వెళ్లాలి. ఈ కేవైసీ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనసరి చేసింది. వాస్తవానికి ఈకేవైసీ చేసుకోవడానికి గడువు మే 31తో ముగిసింది. అయితే కేంద్రం ఆ గడువుని మరో రెండు నెలలు పొడిగించింది.(PM Kisan Alert)

PM kisan Scheme: మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమకాలేదా?.. ఈ ఐదు తప్పులు సరిచేసుకోండి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. మోదీ సర్కార్ అన్నదాతలకు ఈ స్కీమ్ కింద ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా లభిస్తున్నాయి. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇలా రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతోంది. మొదటి విడత ఏప్రిల్-జులై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్-మార్చి మధ్య లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటి వరకు రైతులకు 11 విడతల డబ్బులు అందాయి. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు సెప్టెంబర్ లో రావొచ్చని తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రూ.22 వేలు అందించింది. మరో రూ. 2 వేలు వస్తే.. ఒక్కో రైతుకు రూ.24 వేలు వచ్చినట్లు అవుతుంది.

కాగా పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని సులభంగానే తెలసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

అయితే ఈ స్కీమ్‌ను కొంత మంది దుర్వినియోగం చేశారని, అర్హత లేకున్నా కూడా డబ్బులు పొందారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి వారిని గుర్తించే పనిలో పడింది. అర్హత లేకున్నా డబ్బులు పొందిన వారు మళ్లీ ఆ డబ్బుల తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచింది. దీని కోసం ముందుగా PM కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి. తర్వాత మీరు ‘రీఫండ్ ఆన్‌లైన్’ మీద క్లిక్ చేసి, అభ్యర్థించిన సమాచారాన్ని ఇక్కడ నింపాలి. ఆ తరువాత మీ 12 అంకెల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత వచ్చే క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి. దీని తర్వాత ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే సందేశం కనిపిస్తే, మీరు వాయిదా డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అర్థం. కానీ స్క్రీన్‌పై ‘రీఫండ్ అమౌంట్’ ఆప్షన్ కనిపిస్తే మాత్రం.. మీకు వచ్చిన నగదును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటీసు ఎప్పుడైనా జారీ చేయవచ్చు.