PM Kisan Yojana Alert : రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే డబ్బులు పడవు

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)

PM Kisan Yojana Alert : రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే డబ్బులు పడవు

Pm Kisan Yojana

PM Kisan Yojana Alert : పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. pmkisan.gov.in వెబ్ సైట్ లో ఈ-కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి, రైతులు తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేసి… సబ్మిట్ నొక్కితే ప్రక్రియ పూర్తవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. మోదీ సర్కార్ అన్నదాతలకు ఈ స్కీమ్ కింద ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా లభిస్తున్నాయి. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇలా రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతోంది. మొదటి విడత ఏప్రిల్-జులై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్-మార్చి మధ్య లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

PM kisan Scheme: మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమకాలేదా?.. ఈ ఐదు తప్పులు సరిచేసుకోండి

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటి వరకు రైతులకు 11 విడతల డబ్బులు అందాయి. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు సెప్టెంబర్ లో రావొచ్చని తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రూ.22 వేలు అందించింది. మరో రూ. 2 వేలు వస్తే.. ఒక్కో రైతుకు రూ.24 వేలు వచ్చినట్లు అవుతుంది.

కాగా.. పీఎం కిసాన్ నమోదు చేసుకున్న రైతులందరూ తమ ఈ-కేవైసీని పూర్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రైతులందరికీ eKYC చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రభుత్వం తేదీని పొడిగించడం ఇది రెండోసారి. eKYC కోసం కొత్త చివరి తేదీ జూలై 31, 2022.

eKYCని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి..

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – pmkisan.nic.in

స్టెప్ 2: ‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంలోని ‘eKYC’పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ‘OTP ఆధారిత Ekyc’ విభాగం కింద, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి

స్టెప్ 4: ‘శోధన’పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఇప్పుడు మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ‘OTP పొందండి’పై క్లిక్ చేయండి.

స్టెప్ 6: ఆ తర్వాత మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

స్టెప్ 7: ఎంటర్ చేసిన వివరాలు సక్సెస్ ఫుల్ గా వెరిఫికేషన్ అయితే ఈ-కేవైసీ పూర్తయినట్లే.

PM Kisan Alert : పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే.. నెలాఖరులోగా ఆ పని చేయాల్సిందే

PM కిసాన్ యోజన eKYC: eKYC ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి

స్టెప్ 1: మీ సమీప CSC కేంద్రాన్ని సందర్శించండి.

స్టెప్ 2: PM కిసాన్ ఖాతాలో ఆధార్ అప్‌డేట్‌ను సమర్పించండి.

స్టెప్ 3: లాగిన్ చేయడానికి మీ బయోమెట్రిక్‌లను నమోదు చేయండి.

స్టెప్ 4: ఆధార్ కార్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేసి, ఫారమ్‌ను సమర్పించండి.

మీ ఫోన్ కు కన్ ఫర్మేషన్ SMS వస్తుంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఏదైనా సందేహం లేదా సహాయం కోసం, లబ్ధిదారులు PM-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 011-24300606,155261ను సంప్రదించవచ్చు. ఆధార్ OTP సంబంధిత సమస్యల కోసం వారు aead@nic.inని కూడా సంప్రదించవచ్చు.