PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల వద్దకు వెళ్లిన మోదీ, వారికి అభివాదం చేస్తూ, అంతా కలియతిరిగారు. చిన్నారుల్ని డాన్స్ చేయమని ప్రోత్సహించారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

PM Modi: ఢిల్లీలోని ఎర్రకోటలో సోమవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా చిన్నారుల దగ్గరికి వెళ్లారు. వాళ్లతో ఉత్సాహంగా గడిపారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు.

CM YS Jagan: స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వీళ్లంతా ఎర్రకోట వద్ద కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. అయితే, వేడుకల సందర్భంగా అక్కడే కూర్చొని ఉన్న చిన్నారుల వద్దకు వెళ్లారు మోదీ. దేశ పటం రూపంలో కూర్చుని ఉన్న పిల్లల వద్దకు చేరుకున్న మోదీ.. వారికి అభివాదం చేస్తూ అందరిమధ్య కలియతిరిగారు. అటూఇటూ తిరుగుతూ వారిని ఉత్సాహపరిచారు. మధ్యమధ్యలో వాళ్లతో మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన కొందరు పిల్లల్ని పిలిచి భాంగ్రా నృత్యం చేయమని చెప్పారు. తన పిలుపు మేరకు వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే ప్రధాని చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఈ సమయంలో చిన్నారులందరి మొహాల్లో చిరునవ్వే కనిపించింది.

Independence Day 2022: పిన్‌కోడ్‌కు నేటితో యాభై ఏళ్లు.. ఎలా మొదలైందో తెలుసా?

ప్రధానిని అంత దగ్గరగా చూసే అవకాశం రావడంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేవు. అక్కడ కనిపించిన చిన్నారుల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, నాగాలాండ్, పంజాబ్, జమ్ము-కాశ్మీర్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. ఈ వేడుకల సందర్భంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా ప్రధాని మోదీ చిన్నారులతో ఉత్సాహంగా గడపడం ఆసక్తి కలిగించింది.