PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ

ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయి’’ అని మోదీ అన్నారు

PM Modi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అదానీ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు శథవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అయితే సభలు పునప్రారంభం అయిన అనంతరం కూడా అదే అంశంపై పార్లమెంటులో హైడ్రామా కొనసాగుతోంది. ఈ హైడ్రామా నడుమ బుధవారం పార్లమెంటుకు వచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, యూపీఏ (కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2004 నుంచి 2014 మధ్య జరిగిన కుంభకోణాలను ఏకరువు పెడుతూ విపక్ష పార్టీపై మోదీ దుమ్మెత్తి పోశారు.

Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా

యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవను, తమ ప్రభుత్వం తొమ్మిది ఏళ్లలో చేసిన సేవను పోల్చారు. గతంలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందని మోదీ అన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని గుర్తు చేశారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని అన్నారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని మోదీ అన్నారు.

Lucknow: యూపీ క్యాపిటల్ సిటీ పేరు మారుతోందా? ఇంతకీ అది లఖ్‭నవూ కాకుండా మరేంటి?

ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయి’’ అని మోదీ అన్నారు. దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని అన్న మోదీ.. ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారని, అందుకు ఈడీకి ధన్యవాదాలు చెప్పాల్సిందేనని మోదీ సెటైర్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు