11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

  • Published By: madhu ,Published On : July 3, 2020 / 02:15 PM IST
11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో మోడీ భేటీ కానున్నారు. తన అకస్మిక పర్యటనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు ప్రధాన మంత్రి మోడీ గట్టి హెచ్చరిక పంపినట్లు భావిస్తున్నారు.

ఆయన పర్యటన విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మోడీ లడఖ్ పర్యటన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా పర్యటన తెలియదని అనుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం…చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ లను కలిసిన మోడీ..ప్రత్యేక ఆర్మీ విమానంలో లేహ్ కు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. సముద్రమట్టానికి 11,000 ఎత్తుల అడుగులో ఫార్వర్డ్ పొజిషన్ నీమ్ లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మోడీ.

ఈ ప్రాంతంలో దేశ ప్రధాని సైనిక అధికారులతో సమావేశం కావడం మొదటిసారి. లేహ్ లో ఆరు బయట వేసిన టెంట్ లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇతర అధికారులతో మోడీ సమీక్ష జరిపారు. గాల్వాన్ ఘటన జరిగిన అనంతరం మోడీ లేహ్ లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా సైనికులు జరిపిన దాడిలో భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అనంతరం మూడు సార్లు చర్చలు జరిగాయి.

సరిహద్దు ప్రతిష్టంభనపై లెఫ్టినెంట్ కమాండర్ల స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. ముందటి పరిస్థితి ఎలా ఉందో అలానే ఉండాలని వెల్లడించిన భారత్…చైనా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చలు జరుపుతూనే..సైనికులను, ఆయుధాలను మోహరించింది చైనా. దీంతో ధీటుగానే ఎదుర్కొవడానికి భారత్ రెడీ అయ్యింది. అందులో భాగంగానే..59 యాప్ లను నిషేధించడం తదితర చర్యలు తీసుకుంది.

ఓ వైపు ట్రేడ్ వార్, మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతుండగానే…భారత ప్రధాన మంత్రి మోడీ ఇక్కడ పర్యటించారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో మోడీ భరోసా నింపారని పలువురు వెల్లడిస్తున్నారు. సైనికుల్లో ఉత్సాహాన్ని నింపారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ వెల్లడించారు. ఈ పర్యటన అనంతరం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.

2020, జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది.

భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాశాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్‌-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Read:లద్దాక్ కు ప్రధాని మోడీ..టాప్ కమాండర్లతో మీటింగ్