Modi : పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన విమానంలో మోదీ ల్యాండింగ్‌

వైమానిక ద‌ళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహ‌రించ‌నున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానుంది.

Modi : పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన విమానంలో మోదీ ల్యాండింగ్‌

Modi Purvanchal Expressway

Modi : వైమానిక ద‌ళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహ‌రించ‌నున్నారు. ఆ విమానం మంగళవారం(నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 340 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వేను మంగళవారం ప్రారంభించ‌నున్నారు. ఆ ప్రారంభోత్స‌వానికి మోదీ జంబో విమానంలో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

ఆ హైవేపై వైమానిక ద‌ళ విమానాలు ల్యాండింగ్ రిహార్స‌ల్స్ చేస్తున్న వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. సుల్తాన్‌పూర్ జిల్లాలో ఉన్న సిమెంట్ ఎయిర్‌స్ట్రిప్‌పై సీ-130జే సూప‌ర్ హెర్క్యూల్స్ ల్యాండ్ అవుతుంద‌ని భావిస్తున్నారు. మిరాజ్ 200, ఏఎన్‌-32 ట‌ర్బోప్రాప్‌, సుఖోయ్‌-30 విమానాలు ఇప్ప‌టికే పూర్వాంచ‌ల్ హైవేపై విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

యూపీ రాజధాని లక్నో నుంచి తూర్పు ప్రాంతంలోని బారాబంకి, అమేఠీ, సుల్తాన్‌పూర్, అయోధ్య, ఆజంగఢ్, గాజీపూర్ తదితర జిల్లాలకు కలుపుతూ 340.8 కిమీ మేర నిర్మాణం పూర్తి చేసుకున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే. సుల్తాన్‌పూర్ దగ్గర రహదారిపైనే 3.2 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ ప్రభుత్వం నిర్మించింది. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం చేశారు. రూ.22వేల 500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.