Russia-Ukraine War: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ‌ ఫోనులో మాట్లాడారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య కొన్ని నెల‌లుగా యుద్ధం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో భార‌త్ మొద‌టి నుంచి త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోంది.

Russia-Ukraine War: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ

Putin Modi

Russia-Ukraine War: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ‌ ఫోనులో మాట్లాడారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య కొన్ని నెల‌లుగా యుద్ధం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో భార‌త్ మొద‌టి నుంచి త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోంది. ఇప్పుడు కూడా ర‌ష్యా-ఉక్రెయిన్ విష‌యంలో మోదీ అదే మాట చెప్పారు. చ‌ర్చ‌లు, దౌత్య‌ప‌రంగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నారు.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

ర‌ష్యా-భార‌త్ మ‌ధ్య ద్వైపాక్షిక స‌త్సంబంధాల‌పై పుతిన్, మోదీ ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నారు. గ‌తంలో పుతిన్ భార‌త్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఇరు దేశాలు తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు తీరును ఇరువురు నేత‌లు స‌మీక్షించారు. వీటిలో ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్తు, ఆహార మార్కెట్‌తో పాటు పలు అంతర్జాతీయ విషయాలు కూడా ఉన్నాయి.

Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

ద్వైపాక్షిక‌, అంత‌ర్జాతీయ‌ అంశాల‌పై ఇరు దేశాలు క్ర‌మం త‌ప్ప‌కుండా సంప్ర‌దింపులు జ‌రుపుకోవాల‌ని పుతిన్, మోదీ నిర్ణ‌యించారు. పుతిన్ 2021 డిసెంబ‌రులో భార‌త్‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఇరు దేశాలు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుని వాటిపై ప‌నిచేయాల‌ని ఒప్పందాలు చేసుకున్నాయి.