#IndependenceDay: ఈసారి ప్రసంగంలో టెలిప్రాంప్టర్ కాకుండా పేపర్ నోట్స్ వాడిన మోదీ

స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, దీనికి ఒక రోజు ముందు అంటే ఆదివారం సంప్రదాయం ప్రకారం రాజ్‭ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ కెమెరాలతో మల్టీ సెక్యూరిటీ కవర్ ఏర్పాటు చేశారు.

#IndependenceDay: ఈసారి ప్రసంగంలో టెలిప్రాంప్టర్ కాకుండా పేపర్ నోట్స్ వాడిన మోదీ

PM modi uses paper notes instead of teleprompter for independence day speech

#IndependenceDay: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో టెలిప్రాంప్టర్ ఉపయోగించే విషయమై కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా, తాజాగా స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించన ఆయన తన ప్రసంగంలో టెలిప్రాంప్టర్ ఉపయోగించకుండా ప్రసంగిండం విశేషం. దీనికి బదులు ఆయన పేపర్ నోట్స్ వాడారు.

ఈ ఏడాదితో దేశం 75 వసంతాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో గతేడాది నుంచే ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాని ఈ విషయాన్ని తన ప్రసంగంలో ప్రముఖంగా చెప్పుకొచ్చారు. దేశ స్వాతంత్ర్యంలో ప్రాణాలు అర్పించిన అమరులు, స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన నాయకులను మోదీ గుర్తు చేసుకున్నారు. దేశానికి వారందించిన సేవల్ని కొనియాడారు.

‘‘గాంధీ, భగత్ సింగ్, రాజ్ గురు, రాంప్రసాద్ బిస్మిల్, రాణి లక్ష్మీబాయి, ఝల్కరీ బాయి, సుభాష్ చంద్రబోస్ సహా అనేక మంది బ్రిటిషర్లతో పోరాడి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు. అలాగే జవహార్‭లాల్ నెహ్రూ, రాం మనోహర్ లోహియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా ఇతరులు దేశ స్వతంత్ర పోరాటం చేయడంతో పాటు దేశాన్ని నవనూతనంగా తీర్చిదిద్దారు. వారందరికీ మనం కేవలం సెల్యూట్ చేస్తే సరిపోదు. ఈ దేశం కోసం వారెంతగా తపించారో, ఎన్ని కలలు కన్నారో.. వాటన్నినీ సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని మోదీ అన్నారు.

స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, ఈ ఉదయమే సంప్రదాయం ప్రకారం రాజ్‭ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ కెమెరాలతో మల్టీ సెక్యూరిటీ కవర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 ఉదయం మూడు గంటల పాటు ఆకాశం నిర్మలంగా ఉండేలా వాల్డ్ సిటీ ఏరియా నుంచి 231 మంది శిక్షణ పొందిన పోలీసుల చేత గాలి పటాలు ఎగురవేశారు.

Prime Minister Modi: దేశానికి ఆ రెండు సమస్యలు చెదపురుగులా తయారయ్యాయి.. జనజీవనం నుంచి వాటిని తరిమేద్దాం