PM Narendra Modi: అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. వీడియో

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.

PM Narendra Modi: అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. వీడియో

PM Narendar Modi

PM Narendra Modi: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ ఉన్నారు.

PM Modi: బీజేపీ అభ్యర్థిని కాదు, కమలాన్ని గుర్తుంచుకోండి.. ఎన్నికల ప్రచారంలో మోదీ

అద్వాని నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీకి అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అద్వాని కూర్చున్న వద్దకు వెళ్లి పుష్పగుచ్చం అందించారు. అనంతరం మోదీ, రాజ్ నాథ్ సింగ్, అద్వానీలు కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ, అద్వానీ ఒకరినొకరు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడటం వీడియోలో కనిపించింది.

అద్వానీ బర్త్ డే సందర్భంగా బీజేపీ నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. దేశానికి, సంస్థకు అంకితమైన మీ జీవితం మాకు స్ఫూర్తిదాయకం అంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ తన అవిశ్రాంత ప్రయత్నాలతో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేశారని, ప్రభుత్వంలో భాగంగా దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో డిప్యూటీ పీఎంగా పనిచేసిన అద్వానీ, గత మూడు దశాబ్దాలుగా బీజేపీ ఎదుగుదల వెనుక ప్రధాన శక్తిగా నిలిచారు.