Narendra Modi: జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంగా వచ్చే నెల 2-15 వరకు సోషల్ మీడియాలో జాతీయ జెండాను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 91వ ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆయన మాట్లాడారు.

Narendra Modi: జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి: ప్రధాని మోదీ

Narendra Modi

Narendra Modi: భారతీయులంతా ఆగష్టు 2-15 వరకు తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ ఏడాది ఆగష్టు 15న దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేపట్టబోతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.

Chhole Bhature: బూస్టర్ డోసు తీసుకుంటే ఉచితంగా చోలే బటూరే.. ఎక్కడంటే

ఆదివారం ఉదయం ‘మన్ కీ బాత్’లో భాగంగా పలు సూచనలు చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఆగష్టు 13-15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఇంటిపై ఈ మూడు రోజులూ జాతీయ జెండాను ఎగురవేయాలి. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగలి వెంకయ్య జయంతి ఆగష్టు 2. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా జాతీయ జెండాను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకోవాలి. ఈ రోజు మనం 75 ఏళ్ల స్వాతంత్ర్యం గురించి చర్చిస్తున్నాం. మళ్లీ మనం మరో 25 ఏళ్ల తర్వాత కలుస్తాం.

Gujarat: ఎనిమిదో తరగతి బాలుడిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. అరెస్టు

దానికి సంబంధించిన ప్రయాణం మొదలైంది. మీరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకొన్నారో చెప్పండి. ఏదైనా ప్రత్యేకంగా ఉంటే దాని గురించి మళ్లీ మాట్లాడుకుందాం’’ అని ప్రధాని ప్రసంగించారు. ఇది మోదీ నిర్వహించిన 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కావడం విశేషం.