Milk Shake : పోహా బనానా మిల్క్ షేక్, డయాబెటీస్‌ ఉన్నవారు సైతం తాగొచ్చు!

వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్‌ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు.

Milk Shake : పోహా బనానా మిల్క్ షేక్, డయాబెటీస్‌ ఉన్నవారు సైతం తాగొచ్చు!

Poha Banana Milkshake

Milk Shake : అటుకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అటుకులు, అరటిపండును కలిపి తయారు చేసే పోహా బనానా షేక్‌లో ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇది తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్‌ కూడా అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. పిల్లలకీ, గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇవి చాలా మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులు తీసుకోవచ్చు.

డైటింగ్ చేస్తున్న వారికి దివ్యౌషధం. ఇందులోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్‌ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. గుండె వ్యాధులతో బాధపడేవారికి కూడా ఇవి ఉత్తమ ఆహారం. రాత్రివేళల్లో కూడా దీన్ని తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పోహా బనానా షేక్‌ తయారీ విధానం విషయానికి వస్తే అటుకులు పావు కప్పు, అరటిపండ్లు రెండు, తియ్యటి పెరుగు అరకప్పు, చల్లటి పాలు ఒకటిన్నర కప్పు తీసుకోవాలి. తరువాత బ్లెండర్‌లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన అటుకులను వేయాలి. దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసుకుని తీసుకోవాలి. ఈ జ్యూస్‌ ను పంచదార వేయకుండా తయారు చేస్తారు కాబట్టి దీనిని డయాబెటీస్‌ ఉన్నవారు సైతం తాగవచ్చు.