Vijayawada: విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతం
విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే.

Vijayawada: విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఆంజనేయులు, షేక్ మిర్జా వలి దంపతులకు షఫీదా (3) అనే పాప ఉంది. శివాంజనేయులు, షేక్ మిర్జా వలి చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు రైల్వేస్టేషన్లో ఉంటున్నారు. కిడ్నాప్‌నకు గురైన వారి పాప షేక్ షఫీదా కోసం ఆరు రోజులుగా పోలీసులు గాలించారు.
National Herald case: అందుకే రాహుల్ అంటే బీజేపీ భయపడుతోంది: కాంగ్రెస్
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసులో దర్యాప్తు కొనసాగించారు. గుడివాడకు చెందిన ఇద్దరు మహిళలు పాపని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. చివరకు, పాపను కిడ్నాప్ చేసిన ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పాపను తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా షఫీదా తల్లి షేక్ మిర్జా వలి 10 టీవీతో మాట్లాడుతూ.. ఆరు రోజులగా పాప కోసం విలపించామని, ఈ రోజు పాపను పోలీసులు తమకు అప్పజెప్పారని తెలిపారు.
congress: ఏ నేరంపై విచారణ జరుపుతున్నారని అడిగితే సమాధానం లేదు: చిదంబరం
గుడివాడకి చెందిన ఇద్దరు మహిళలు పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని పోలీసులు తమకు చెప్పారని అన్నారు. చివరకు కేసును ఛేదించి పాపను తమకు అప్పజెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. తమ పాప గురించి 10 టీవీలో ప్రసారం చేశారని అన్నారు. 10 టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. తమ పాపను అపహరించిన ఇద్దరు మహిళలను కఠినంగా శిక్షించాలని కోరారు. తాను అనుభవించిన మనోవేదనను ఏ తల్లిదండ్రులు అనుభవించకూడదని అన్నారు.
bjp: 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించి యువతలో మోదీ నమ్మకాన్ని నింపారు: కేంద్ర మంత్రులు
అనంతరం ఆ పాప తండ్రి శివాంజనేయులు 10 టీవీతో మాట్లాడుతూ… గుంటూరుకు చెందిన కొంతమందికి తమ పాపను రెండు లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు చెప్పారని వివరించారు. పాప ఆచూకీ తెలియ ఆరు రోజులుగా తమ కుటుంబం పడిన బాధను ఎవరూ పడకూడదని, నిందితులను శిక్షించాలని కోరారు. ఆరు రోజుల నుంచి తమ పాప కోసం నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో తమ పాపను గాలించి, ఆచూకీ గుర్తించి, తమకు అప్పజెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 10 టీవీకి తమ పాప గురించి ప్రచారం చేయటం వల్లే ఆమె తమకు దొరికిందని అన్నారు. 10 టీవీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
- Vijayawada Girl Kidnap : అంగన్వాడీ ఆయానే కిడ్నాపర్.. విజయవాడ బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి
- Konda Surekha: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: కొండా సురేఖ
- Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
- Baby Kidnap: చిన్నారి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం
- Bengaluru: మహిళపై యాసిడ్ దాడి చేసిన తోటి ఉద్యోగి
1Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
2Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు
3CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి
4BJP Meeting: బీజేపీ నేతలకు తెలంగాణ రుచులు.. యాదమ్మ మోనూ ఇదే
5BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు
6Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
7Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
8Adah Sharma : వర్షాకాలంలో అదాశర్మ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??
9Rahul Gandhi: “ఈడీ విచారణపై రాహుల్.. ఆ ఐదు రోజులను మెడల్లా భావిస్తా”
10Parking Lot: బీజేపీ సభ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్
-
BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధం
-
Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
-
UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
-
Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
-
TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు