Mumbai: విదేశీయురాలితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు.. లైవ్ స్ట్రీమింగ్‌లో టెలికాస్ట్.. స్పందించిన పోలీసులు

దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Mumbai: విదేశీయురాలితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు.. లైవ్ స్ట్రీమింగ్‌లో టెలికాస్ట్.. స్పందించిన పోలీసులు

Mumbai: ముంబైలో విదేశీయురాలితో అనుచితంగా ప్రవర్తించాడో యువకుడు. లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ ఘటన టెలికాస్ట్ అయింది. దీంతో యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన మైయోచి అనే యూట్యూబర్ ముంబైలో పర్యటిస్తోంది.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

ఈ సందర్భంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెకు బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని, తనతో రమ్మని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ యువకుడు వినిపించుకోలేదు. ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రవర్తించాడు. ఆమె ఎలాగోలా అతడ్నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ, అతడు ఆమె వెంట పడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అక్కడ్నుంచి తప్పించుకుంది. ఈ వీడియోలో ఆ యువకుడు ఎంత అనుచితంగా ప్రవర్తించినప్పటికీ, ఆమె సంయమనం కోల్పోకుండా చిరునవ్వుతోనే కనిపించడం విశేషం. అయితే, ఈ వేధింపులు అక్కడితో ఆగలేదు. ఆ కుర్రాడు బైక్‌పై కొద్ది దూరం ఆమెను వెంబడించాడు.

Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

బైకుపై మరో కుర్రాడు కూడా ఉన్నాడు. తన బైకు సీటుపై కూర్చోవాలంటూ వేధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో లైవ్ స్ట్రీమింగ్ కావడంతోపాటు, సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముబై పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందించాలని పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన యువతి ఘటన వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.