TTD: టీటీడీ ఉద్యోగిపై దాడి.. నిందితుడు అరెస్ట్

తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసుకున్నారు.

TTD: టీటీడీ ఉద్యోగిపై దాడి.. నిందితుడు అరెస్ట్

Ttd

TTD: టీటీడీ ఉద్యోగి వెంకటరత్నంపై దాడి కేసులో నిందితుడు బబ్లూ అలియాస్ పృథ్వీ రాజ్‌ను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా బబ్లూపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు

బబ్లూకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, గతంలో ప్రెస్ రిపోర్టర్‌గా చెప్పుకొంటూ తిరిగే వాడని పోలీసులు చెప్పారు. కాగా, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ వేణుగోపాల్ అన్నారు. బబ్లూపై అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేయడంతోపాటు, పీడీ యాక్ట్ కూడా పెడతామని పోలీసులు తెలిపారు.