జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మందకొడిగా పోలింగ్‌..మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.2 శాతం

  • Published By: bheemraj ,Published On : December 1, 2020 / 02:15 PM IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మందకొడిగా పోలింగ్‌..మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.2 శాతం

GHMC elections Polling Dull : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం దాటినా చాలా కేంద్రాల్లో పోలింగ్ ఊపందుకోలేదు. ఇప్పటిదాకా 18.2 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది.



ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.



హైదరాబాద్ జియాగూడలో 38వనెంబరు పోలింగ్ బూత్‌లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్ ఓటర్ జాబితాలో ఓటు ఉన్నప్పటికీ… పోలింగ్ బూత్ ఓటర్ లీస్ట్ లో డిలీట్ అని చూపెడుతుందని ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు.



ఓటర్ స్లిప్ లు వచ్చినప్పటికీ.. ఓట్లు లేకపోవడంతో ఓటర్లు నిరసనకు దిగారు. మరో పోలింగ్ బూత్ లో ఓటు ఉండే అవకాశం ఉందని ..పోలింగ్ బూత్ అధికారులు అంటున్నారని, కానీ ఎక్కడా తమ ఓటు కనిపించలేదని ఓటర్లు మండిపడుతున్నారు.



ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు అయింది. గుర్తులు తాసీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు రుమారు కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. 26 వ నెంబర్ వార్డులో బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. కంకి కొడవలి గుర్తు స్థానంలో సుత్తి కొడవలి గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ ను రద్దు చేశారు.