Pooja Hegde : ఇంకా కోలుకొని పూజా.. వాకర్ సాయంతో నడుస్తున్న బుట్టబొమ్మ..

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమా ఆఫర్స్ ఉన్నాయి. కానీ వాళ్లంతా షూటింగ్ ఆపేసి ఈ బుట్టబొమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే ఓ సినిమా షూట్ లో గాయపడింది. కాలికి బాగా దెబ్బ తగలడంతో...............

Pooja Hegde : ఇంకా కోలుకొని పూజా.. వాకర్ సాయంతో నడుస్తున్న బుట్టబొమ్మ..

Pooja Hegde :  స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమా ఆఫర్స్ ఉన్నాయి. కానీ వాళ్లంతా షూటింగ్ ఆపేసి ఈ బుట్టబొమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే ఓ సినిమా షూట్ లో గాయపడింది. కాలికి బాగా దెబ్బ తగలడంతో నడవలేకపోయింది. దీని గురించి తన సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపింది,

అయితే పూజా ఇంకా ఈ గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తుంది. తాజాగా పూజా హెగ్డే ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. వాకర్ పట్టుకొని పక్కన నర్స్ సాయంతో పూజా హెగ్డే నడుస్తుంది. దీంతో పూజా హెగ్డే ఇంకా కోలుకోలేదని, పూర్తిగా నడవలేకపోతుందని తెలుస్తుంది. ఈ వీడియోని పోస్ట్ చేసి నేను మళ్ళీ లైఫ్ లో సెకండ్ టైం నడక నేర్చుకుంటున్నాను చాలా జాగ్రత్తగా అని పోస్ట్ చేసింది.

Manjima-Gautham : పెళ్ళికి సిద్దమైన తమిళ హీరో, హీరోయిన్.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్..

బుట్టబొమ్మని ఈ స్థితిలో చూసి అభిమానులు బాధపడుతున్నారు. పూజాహెగ్డే త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా సెట్స్ కి రావాలని చిత్ర యూనిట్స్ కూడా కోరుకుంటున్నారు.