‘సుందరి’ గా పూర్ణ నట విశ్వరూపం

సినిమాలతో పాటు టెలివిజన్ జడ్జ్‌గానూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ అలియాస్ షామ్నా కసీమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరి’.. అర్జున్ అంబటి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి గోగన దర్శకుడు. రిజ్వాన్ నిర్మాత. తాజాగా ‘సుందరి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

10TV Telugu News

Sundari: సినిమాలతో పాటు టెలివిజన్ జడ్జ్‌గానూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ అలియాస్ షామ్నా కసీమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరి’.. అర్జున్ అంబటి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి గోగన దర్శకుడు. రిజ్వాన్ నిర్మాత. తాజాగా ‘సుందరి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

పల్లెటూరిలో పద్ధతిగా పెరిగిన ఓ మధ్య తరగతి యువతి జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. భర్త పెట్టే చిత్ర హింసలను తట్టుకుని, అనుకోని మలుపు తిరిగిన తర్వాత ఎలాంటి బాధలు అనుభవించింది అనేది ట్రైలర్‌లో చూపించి సినిమాపై ఆసక్తి కలిగించారు.

Sundari

పూర్ణ అందచందాలతో పాటు నటనతోనూ అలరించింది. విజువల్స్, ఆర్ఆర్ కూడా చక్కగా కుదిరాయి. త్వరలో ‘సుందరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు.