దేశంలో పోర్న్ బ్యాన్ చేసినా.. చూసేవారు తగ్గలేదు.. అమ్మాయిలు, టీనేజర్లే ఎక్కువ

దేశంలో పోర్న్ బ్యాన్ చేసినా.. చూసేవారు తగ్గలేదు.. అమ్మాయిలు, టీనేజర్లే ఎక్కువ

మన దేశంలో పోర్న్‌పై నిషేధం విధించినా.. వీడియోలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ లెక్కలు చూస్తే పోర్న్ చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. లాక్‌డౌన్, సామాజికదూరం వంటి కారణాలతో 2020 మొత్తం గడిచిపోగా.. ఈ ఏడాది పోర్న్ ఎక్కువగా చూశారట దేశంలో.. ఇందుకు సంబంధించి వచ్చిన నివేదికలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

భారతదేశంలో పోర్న్ వెబ్‌సెట్లు బ్యాన్ చేసినా.. వీడియోలు చూసేవారి సంఖ్య తగ్గడం లేదు అని, పోర్న్ చూసినవారి సంఖ్య పరంగా గత రికార్డులను ఈ ఏడాదిలో భారత్‌లో దాటేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రపంచంలో పోర్న్ చూసే దేశాల్లో మన దేశం ముందంజలో నిలిచినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు మన దేశంలో పోర్న్ చూసేవాళ్లలో 30 శాతం యువతులేనని లెక్కల్లో తేలింది. ఆ విషయాన్ని పక్కనబెడితే పోర్న్ చూస్తున్నవారిలో చాలామంది చిన్నవయస్సు వారే కావడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోన్న అంశం. భారతదేశంలో పోర్న్ సైట్లపై నిషేధం ఉన్నా, పకడ్బందీగా అమలు కాకపోవడం వల్ల చేతివేళ్లకూ అందుబాటులో ఫోన్‌లలోనే పోర్న్ సైట్లను చూసేస్తున్నారు.

పోర్న వీడియోలు 71.6 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లో చూస్తుంటే.. 19.7 శాతం మంది డెస్క్‌టాప్‌లో, 8.7శాతం ట్యాబ్లెట్స్‌లో చూస్తున్నారట. మన భారతదేశంలో 90శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లోనే పోర్న్ వీడియోలు చూస్తుండగా.. మిగతా 10శాతం మంది డెస్క్‌టాప్, ట్యాబ్లెట్స్‌లో చూస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

2020 సంవత్సరంలో ఆన్‌లైన్ క్లాసులు పేరుతో పిల్లలు ఎక్కువగా ఫోనుల్లోనే గడిపేశారు. ఈ సమయంలో ఎక్కువగా పిల్లలు పోర్న్ వీడియోల కోసం సర్ఫింగ్ చేసినట్లు చెబుతున్నాయి అధ్యయనాలు. దేశంలో ఇప్పటివరకు 3500పోర్న్ వెబ్‌సైట్లు బ్యాన్ చెయ్యగా.. ఇంకా కూడా అనేకయ వెబ్‌సైట్లు జనాలకు అందుబాటులో ఉన్నాయి.