Mahesh Babu : పవన్ కళ్యాణ్ నటన పవర్ పుల్..వకీల్ సాబ్ పై మహేష్ బాబు ప్రశంసల జల్లు

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు మహేశ్ బాబు.

Mahesh Babu : పవన్ కళ్యాణ్ నటన పవర్ పుల్..వకీల్ సాబ్ పై మహేష్ బాబు ప్రశంసల జల్లు

Vakeel Saab Film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత..తమ అభిమాన నటుడు తెరపై కనిపించడంతో అభిమానుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. ఆయన నటనకు ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన నటన అద్బుతంగా ఉందని కొనియాడుతున్నారు. తాజాగా..టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాప్ ఫాంలో ఉన్నారని, కంబ్యాక్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ప్ర‌కాశ్ రాజ్ బ్రిలియంట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు అని మ‌హేష్ తెలిపారు. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య పాత్ర‌ల‌పై కూడా మ‌హేష్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ముగ్గురు యువ‌తలు అద్భుతంగా యాక్ట్ చేశారని ప్రశంసలు కురిపించారు. వీరి నటన మనసుకు హత్తుకుందన్నారు. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ మొత్తం చిత్రం కాస్ట్ అండ్ క్రూ కి సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన వకీల్ సాబ్ సినిమా రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా రాబట్టింది.

Read More : Veerappan Daughter : వీరప్పన్ ఉండే అడవుల్లో భారీగా నిధుల డంప్