Prabhas Adipurush: ‘ఆదిపురుష్’లో మేఘనాధుడిగా బిగ్ బాస్ విన్నర్?

ఒక్క బాహుబలి సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్‏గా మార్చేసింది. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తున్నాడు.

Prabhas Adipurush: ‘ఆదిపురుష్’లో మేఘనాధుడిగా బిగ్ బాస్ విన్నర్?

Prabhas Adipurush

Prabhas Adipurush: ఒక్క బాహుబలి సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్‏గా మార్చేసింది. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ టెక్నాలజీతో ఆదిపురుష్ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు.

ప్రభాస్-ఓం రౌత్ ఎప్పుడైతే ఆదిపురుష్ సినిమా ప్రకటించారో అప్పటినుండి సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా, కృతిసనన్ సీత పాత్రల్లో నటిస్తుండగా ఈమధ్యనే హైదరాబాద్ కు షూటింగ్ షిఫ్ట్ అయింది. కాగా, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాలోని మేఘనాధుడు అనే పాత్రకోసం సిద్ధార్థ్ ను సంప్రదించగా.. ఇంకా సిద్దార్ధ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని వినిపిస్తుంది. ఇంతకీ ఈ సిద్దార్ధ్ ఎవరనుకుంటున్నారా.. బాలీవుడ్ బిగ్ బాస్-13 విన్నర్ ఈ సిద్ధార్థ్. మోడల్, నటుడిగా, పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించే సిద్దార్ధ్ బిగ్ బాస్ విన్నర్ తర్వాత భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. కాగా, మేఘనాధుడి పాత్రకు సిద్దార్ధ్ అయితే కరెక్ట్ అని భావించిన ఓంరౌత్ చర్చలు జరుపుతున్నాడు. మరి సిద్దార్ధ్ ఒకే అంటాడా.. లేక నో చెప్తాడా.. చూడాలి!