Prabhas : ఆదిపురుష్‌ని వెనక్కి నెట్టిన సలార్ ??

ఆదిపురుష్ సంక్రాంతి బరిలోకి వద్దామనుకున్నా టీజర్ విపరీతంగా నెగెటివిటీ ఫేస్ చెయ్యడంతో జనవరి నుంచి జూన్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మరో 100కోట్లు బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ కి కరెక్షన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. అసలే సాహో, రాధేశ్యామ్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల తర్వాత.............

Prabhas : ఆదిపురుష్‌ని వెనక్కి నెట్టిన సలార్ ??

ఆదిపురుష్ అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. అసలు ప్రభాస్ ప్లానింగ్ నే తారుమారుచేసింది. ఒక్క టీజర్ తోనే ప్రభాస్ ఇమేజ్ ని, సినిమా మీద ఫ్యాన్స్ అంచనాలని పాతాళంలో పడేసిన ఆదిపురుష్ ని జనాలు మర్చిపోవాలన్నా, ప్రభాస్ పాత క్రేజ్ మళ్లీ రావాలన్నా ఆదిపురుష్ కంటే ముందే ఇంకో సినిమా పడితే బెటర్ అనుకున్నారేమో, లేదా ఆదిపురుష్ రీవర్క్ కి ఇంకా టైం పట్టేలా ఉందేమో అందుకే సలార్ తెరపైకి వచ్చింది.

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ఆదిపురుష్. ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేసినా రాముడిగా, దేవుడిగా ఆడియన్స్ కి సరికొత్తగా పరిచయం అవుతున్న ప్రభాస్ ని, రాముడిగా ప్రభాస్ చూపించే రామాయణాన్ని చూడాలని జనాలు ఎంతో ఎదురుచూశారు. కానీ ఆదిపురుష్ టీజర్ జనాల అంచనాల్ని అసలు అడ్రస్ లేకుండా చేసింది. అప్పటి వరకూ ప్రభాస్ సినిమా అంటే జనాలకున్న ఇంట్రస్ట్ ని, క్రేజ్ ని కూడా కనపడకుండా చేసింది. ఇలాంటి పరిస్తితుల్లో ప్రభాస్ ని కాపాడేది ఒక్క సలారే అంటున్నారు.

ఆదిపురుష్ సంక్రాంతి బరిలోకి వద్దామనుకున్నా టీజర్ విపరీతంగా నెగెటివిటీ ఫేస్ చెయ్యడంతో జనవరి నుంచి జూన్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మరో 100కోట్లు బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ కి కరెక్షన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. అసలే సాహో, రాధేశ్యామ్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ సినిమా మీద క్రేజ్ మళ్లీ రావాలన్నా, జనాలకి ఇంట్రస్ట్ కలగాలన్నా అర్జెంటుగా ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అవ్వాలి. అందుకే ఆదిపురుష్ ని జూన్ లో కాకుండా 2024 రిలీజ్ కు పోస్ట్ పోన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

Also read…………….. Lokesh Kanagaraj : ప్రభాస్ తమిళ డైరెక్టర్ కి ఛాన్సిచ్చాడా??

అభిమానులు కూడా ఆదిపురుష్ సినిమాపై అంచనాలు వదిలేసుకోవడంతో ప్రస్తుతం ప్రభాస్ భవిష్యత్తు సలార్ సినిమా మీదే ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ ప్రభాస్ ని వరస ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుందని స్ట్రాంగ్ గా ఫీలవుతున్నారు. అందుకే సెప్టెంబర్ లో రిలీజ్ అనౌన్స్ చేసిన సలార్ నే ముందుగా రిలీజ్ చేసి, ఆ తర్వాత ఆదిపురుష్ సంగతి చూద్దామని ప్లాన్ చేస్తున్నారు. సలార్ లాంటి సాలిడ్ మూవీ పడితే మళ్లీ ప్రభాస్ ట్రాక్ లోకి వస్తారని, ఆ హిట్ తో జనాలు కూడా ఆదిపురుష్ మీద నెగెటివిటీని కాస్త మర్చిపోయే ఛాన్సుందని అనుకుంటున్నారు. అందుకే సలార్ కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి.