Prabhas: మూడు ప్రాజెక్టులతో బిజీగా మారిన ప్రభాస్.. తీరికే లేదట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేయడంతో, ప్రభాస్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

Prabhas: మూడు ప్రాజెక్టులతో బిజీగా మారిన ప్రభాస్.. తీరికే లేదట!

Prabhas Busy With Shooting For Three Movies

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేయడంతో, ప్రభాస్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఆయన సలార్, ప్రాజెక్ట్-K సినిమాల్లో నటిస్తున్నాడు.

Prabhas: నెట్‌ఫ్లిక్స్ చేసిన పనికి వరల్డ్ వైడ్‌గా ట్రోలింగ్‌కి గురవుతున్న ప్రభాస్.. కోపంలో డార్లింగ్ ఫ్యాన్స్..

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ సినిమా షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ కథతో సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమాలో కూడా ప్రభాస్ నటించేందుకు ఓకే చేశాడు.

Prabhas : ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్?? ప్రభాస్ చేతిలో మొత్తం ఆరు సినిమాలు.. ఎప్పటికి అయ్యేనో??

ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలోనూ సమయం దరొకినప్పుడల్లా ప్రభాస్ పాల్గొంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్, ఏ సినిమాను ముందుగా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.