Mahesh Babu: మహేష్ ట్వీట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!

టాలీవుడ్‌లో ఎవరైన సెలబ్రిటీ ఏదైనా ట్వీట్ చేశాడంటే వారి అభిమానుల నుండే కాకుండా ఇతర సెలబ్రిటీల అభిమానుల నుండి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది.

Mahesh Babu: మహేష్ ట్వీట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!

Prabhas Fans Waiting For Mahesh Babu Tweet On Radhe Shyam

Mahesh Babu: టాలీవుడ్‌లో ఎవరైన సెలబ్రిటీ ఏదైనా ట్వీట్ చేశాడంటే వారి అభిమానుల నుండే కాకుండా ఇతర సెలబ్రిటీల అభిమానుల నుండి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల కాలంలో ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండటంతో ఆయనకు ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే తాజాగా మహేష్ ఒక్క ట్వీట్ చేస్తే బాగుంటుందని హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Mahesh Babu : సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్..

ఇంతకీ మహేష్ దేని గురించి ట్వీట్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారో తెలుసా.. ఇటీవల రిలీజ్ అయిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ గురించి సూపర్ స్టార్ ఏదైనా ట్వీట్ చేయాలని వారు చూస్తున్నారు. మహేష్ బాబు ఈమధ్య కాలంలో ఇతర హీరోల సినిమాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి కూడా తన అభిప్రాయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. అయితే రాధేశ్యామ్ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా చాలా స్లోగా ఉందంటూ కామన్ ఆడియెన్స్ నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేస్తుండటంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో ఎవరైనా స్టార్ సెలబ్రిటీ తమ అభిమాన హీరో సినిమా గురించి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వేరే హీరోల సినిమాలపై ఎప్పుడూ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే మహేష్ బాబు, రాధేశ్యామ్ గురించి ఓ పాజిటివ్ ట్వీట్ చేస్తే సినిమాకు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని వారు కోరుతున్నారు.

Mahesh Babu: మహేష్ కోసం పవన్ ఫార్ములా..?

ఈ క్రమంలోనే వారు మహేష్ బాబును రాధేశ్యామ్ గురించి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆడియెన్స్‌ను మెప్పించలేని రాధేశ్యామ్ గురించి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే మహేష్ తన క్రెడిబిలిటీని కోల్పోతాడని, అందుకే ఈ విషయంలో ఆయన సైలెంట్‌గా ఉంటేనే మంచిదని మహేష్ ఫ్యాన్స్ ఆయనకు సూచిస్తున్నారు. మరి రాధేశ్యామ్ చిత్రంపై మహేష్ బాబు ఏదైనా కామెంట్ చేస్తాడా.. లేక సైలెంట్‌గా ఉండిపోతాడా అనేది చూడాలి.