‘రాధే శ్యామ్’ యూనిట్‌కి డార్లింగ్ ఖరీదైన సంక్రాంతి కానుక..

‘రాధే శ్యామ్’ యూనిట్‌కి డార్లింగ్ ఖరీదైన సంక్రాంతి కానుక..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. కృష్ణంరాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా సంక్రాంతి పండుగని పురస్కరించుకుని డార్లింగ్ ప్రభాస్ చిత్ర యూనిట్ అందరికీ ఖరీదైన బహుమతులు అందించారు. టైటాన్ కంపెనీ వారి TRAQ రిస్ట్ వాచెస్ టీమ్ మెంబర్స్‌కి గిఫ్ట్ ఇచ్చారు ప్రభాస్. ఈ సందర్భంగా యూనిట్ ఆయనకు థ్యాంక్స్ తెలిపారు.