Prabhas21: హాలీవుడ్ రేంజిలో ఫ్యూచర్ కథతో నాగ్ అశ్విన్ సినిమా?!

ఇప్పుడు బాహుబలి లాంటి మరో సినిమా కనుక పడితే ప్రభాస్ స్థాయి అంచనా వేయడం కూడా ఎవరి వాళ్ళ కాదేమో. అంతగా ఆయన క్రేజ్ ఇప్పుడు అంతగా పెరిగిపోయింది. ప్రభాస్ హీరోగా వచ్చే సినిమా అనగానే వందల కోట్ల బడ్జెట్..

Prabhas21: హాలీవుడ్ రేంజిలో ఫ్యూచర్ కథతో నాగ్ అశ్విన్ సినిమా?!

Prabhas Nag Ashwin Movie With A Future Story In The Hollywood Range

Prabhas21: ఇప్పుడు బాహుబలి లాంటి మరో సినిమా కనుక పడితే ప్రభాస్ స్థాయి అంచనా వేయడం కూడా ఎవరి వాళ్ళ కాదేమో. అంతగా ఆయన క్రేజ్ ఇప్పుడు అంతగా పెరిగిపోయింది. ప్రభాస్ హీరోగా వచ్చే సినిమా అనగానే వందల కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా స్థాయి కథ.. అంతకు మించి క్యాస్టింగ్ ఇది ఇప్పుడు మన రెబల్ స్టార్ చేస్తున్న సినిమాల రేంజ్. ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ సినిమాలు ఇప్పటికే ట్రాక్ మీదకెక్కగా నాగ్ అశ్విన్ తో పాటు సిద్దార్థ్ ఆనంద్ తో సినిమాలు వరసలో ఉన్నాయి.

కాగా.. ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ సినిమాల కథల విషయంలో అంతో ఇంతో క్లారిటీ ఉండగా.. నాగ్ అశ్విన్ కథపై మాత్రం కొంతకాలంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హై బడ్జెట్ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ అనే టాక్ ఉన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలు పెట్టుకొని షూట్ కు సిద్ధం అవుతుంది. ఇప్పటికే పాన్ ఇండియాకు కావాల్సిన నటీనటులను కూడా ఎంచుకున్న నాగ్ అశ్విన్ సంప్రదింపులు కూడా మొదలుపెట్టాడట.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాలాగా లేక ప్రస్తుత కథలాగో కాకుండా పూర్తిగా భవిష్యత్తులో ఉండే హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుందట. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమాలో కథ 2050వ సంవత్సరం నాటి స్థాయితో పాటు కథ కూడా అదే స్పీడుతో నడుస్తుందని టాక్ మొదలైంది. సినిమా మీద నాగ్ అశ్విన్ పూర్తిస్థాయి కాన్ఫిడెంట్ తో పాటు ఊహించని విధంగా ఉండాలని తపనపడుతున్నాడట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందే!