మీసకట్టు అదిరింది.. డార్లింగ్ సెకండ్ లుక్ ఎందుకంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. డార్లింగ్ ప్రస్తుతం ‘సలార్’ షూటింగులో పాల్గొంటున్నారు. ‘ఆదిపురుష్’ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా ప్రీ ప్రొడక్షన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ‘సలార్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్‌లో ప్రభాస్ గెడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించారు.

మీసకట్టు అదిరింది.. డార్లింగ్ సెకండ్ లుక్ ఎందుకంటే..

Prabhas New Look: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. డార్లింగ్ ప్రస్తుతం ‘సలార్’ షూటింగులో పాల్గొంటున్నారు. ‘ఆదిపురుష్’ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా ప్రీ ప్రొడక్షన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ‘సలార్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్‌లో ప్రభాస్ గెడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించారు.

Prabhas

 

ఇక రీసెంట్‌గా ‘జాతి రత్నాలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో క్లీన్ షేవ్‌తో మెలితిరిగిన మీసాలతో కొత్తగా కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.. ఈ లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది.. అయితే ఈ గెటప్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ కోసం అని, కాదు ‘సలార్’ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కనిపించనున్నారు. సెకండ్ క్యారెక్టర్ కోసమే ఇలా మేకోవర్ అయ్యాడని పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..

Prabhas

‘సలార్’ లో డార్లింగ్ పక్కన తొలిసారి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’ నిర్మాత, దర్శకుడు కలిసి తెరకెక్కిస్తున్నారు. మధు గురుస్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 2022 ఏప్రిల్ 14న తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌ భారీ స్థాయిలో ‘సలార్’ విడుదల కానుంది.

Prabhas