ప్రభాస్ అండ్ టీం కి బెదిరింపులు.. అందుకే భారీ భద్రత?

ప్రభాస్ అండ్ టీం కి బెదిరింపులు.. అందుకే భారీ భద్రత?

Prabhas Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘రాధే శ్యామ్’ కి గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్, ‘సలార్’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మంగళవారం (ఫిబ్రవరి 2) ‘ఆదిపురుష్’ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం సంభంవించిదనే వార్త మర్చిపోకముందే మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

‘సలార్’ రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యే రామగుండంలో స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ రామగుండంలోకి ఎంటర్ అవడంతోనే హై సెక్యూరిటీ కల్పించారు. రామగుండం కమీషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ భద్రతనివ్వడం విశేషం. అయితే దీని వెనక చాలా కారణాలే ఉన్నట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

https://10tv.in/a-major-fire-broke-out-on-the-sets-of-adipurush/

యూనిట్‌కి వార్నింగ్..
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్నామని ‘సలార్’ టీం తెలిపిన తర్వాత నక్సల్స్ నుంచి హెచ్చరికలు వచ్చాయట. ‘సలార్’ టీం, ప్రభాస్‌కు బెదిరింపులు రావడంతోనే ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారట.

వీలైనంత త్వరగా..
భారీ భద్రత కల్పించినప్పటికీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అక్కడి వారు కూడా చెప్పడంతో ‘సలార్’ టీం స్పీడ్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 12 వరకు అనుకున్న ఈ షెడ్యూల్ అంతకంటే ముందే ప్యాకప్ అయ్యేలా కనిపిస్తోంది.

https://10tv.in/gorgeous-and-versatile-actress-shruti-haasan-on-board-for-salaar/