సుమంత్‌కి డార్లింగ్ గిఫ్ట్స్, విషెస్..

10TV Telugu News

Prabhas: ‘దేవి, శత్రువు, ఒక్కడు, దేవీపుత్రుడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్.ఎస్.రాజు తనయుడు, యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యారు.. దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Sumanth Ashwin

ఈ వివాహానికి ఇరు కుటుంబాల వారు, బంధువులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు అటెండ్ అయ్యారు. ఇండస్ట్రీ నుండి కేవలం పదిమందిని మాత్రమే ఆహ్వానించారు. నటి తేజస్వి మడివాడ పెళ్లిలో పాల్గొని సందడి చేసింది.

Sumanth Ashwin

తాజాగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపారు. ‘విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుమంత్.. ఫ్రమ్: ప్రభాస్’ అంటూ డార్లింగ్ కొత్త జంటను విష్ చేశారు. ఈ విషయాన్ని ఎమ్.ఎస్.రాజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.