ప్రభు దేవా పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్ అసలు!..

ప్రభు దేవా పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్ అసలు!..

Prabhu Deva: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభు దేవా దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఛాలెంజింగ్‌గా నటనకు ఆస్కారమున్న పాత్రలు వస్తే హీరోగా సినిమాలు చేస్తున్నారు. ‘అభినేత్రి’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘భగీరా’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను భయపెట్టడానికి రాబోతున్నారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభు దేవా పలు డిఫరెండ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటిస్తున్న ‘భగీరా’ తమిళ్ టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. భరతన్ పిక్చర్స్ బ్యానర్ మీద ఆర్.వి. భరతన్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమైరా దస్తూర్, రమ్యా నంబీశన్, జననీ అయ్యర్, సంచితా శెట్టి, సాక్షి అగర్వాల్, సోనియా అగర్వాల్, సాయి కుమార్, నాజర్, ప్రగతి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూనే థ్రిల్ కలిగించింది. ప్రభు దేవా విభిన్న పాత్రల్లో అదుర్స్ అనిపించారు. ప్రభు దేవా ఒకరు కాదు ఇద్దరు అంటూ సైకో కిల్లర్‌గా మర్డర్స్ చెయ్యడం చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగా కుదిరాయి.. త్వరలో ‘భగీరా’ గా ప్రభు దేవా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.