Poikkal Kuthirai : కృత్రిమ కాలుతో ప్రభుదేవ… పొయిక్కల్ కుదిరై పోస్టర్

యాక్టర్ కమ్ డైరెక్టర్ గా అలరించిన ప్రభుదేవా న్యూ మూవీకి సంబంధించిన పోస్టర్ అలరిస్తోంది. ఇప్పటికే డ్యాన్సర్, నటుడిగా, దర్శకుడిగా అలరించిన ఇతను..చాలా గ్యాప్ తీసుకుని మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Poikkal Kuthirai : కృత్రిమ కాలుతో ప్రభుదేవ… పొయిక్కల్ కుదిరై పోస్టర్

Film

Prabhudeva first look  : యాక్టర్ కమ్ డైరెక్టర్ గా అలరించిన ప్రభుదేవా న్యూ మూవీకి సంబంధించిన పోస్టర్ అలరిస్తోంది. ఇప్పటికే డ్యాన్సర్, నటుడిగా, దర్శకుడిగా అలరించిన ఇతను..చాలా గ్యాప్ తీసుకుని మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంతోష్ పి.జయకుమార్ డైరెక్షన్ లో పొయిక్కల్ కుదిరై మూవీ రూపొందుతోంది. చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తుండడం విశేషం

పోస్టర్ విషయానికి వస్తే…ఓ చేతిలో ఆయుధం పట్టుకుని..మరో చేతితో పాపనుఎత్తుకున్నాడు. లుంగీ కట్టుకుని, బనియన్ తో ఉన్న ప్రభుదేవాను కృత్రిమ కాలుతో ఎలా నటించాడనే ఉత్కంఠ నెలకొంది. శత్రువుల నుంచి ఆ పాపను ఎలా కాపాడారనే కథతో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ప్రభుదేవాకు జంటగా రైజా విల్సన్ నటిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇమ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. కెరియర్ పరంగా ప్రభుదేవాకి ఇది 54వ సినిమా.