Prakash Raj: మోదీని ఆకాశానికెత్తిన హీరో విశాల్.. కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్!

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన యాక్టింగ్‌తో అభిమానులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ నటుడు రాజకీయాలపై కూడా నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. తాజాగా, ప్రకాశ్ రాజ్ తమిళ యంగ్ హీరో విశాల్ చేసిన ఓ కామెంట్‌కు సెటైరిక్ కౌంటర్ ఇచ్చాడు.

Prakash Raj: మోదీని ఆకాశానికెత్తిన హీరో విశాల్.. కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్!

Prakash Raj Counter To Vishal Comments On PM Modi

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన యాక్టింగ్‌తో అభిమానులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ నటుడు రాజకీయాలపై కూడా నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. పలుమార్లు వివాదాల్లోనూ ఇరుక్కుంటాడు. అయితే బీజేపీని దుమ్మెత్తిపోయడంలో మాత్రం ప్రకాశ్ రాజ్ తనకంటూ ఓ ప్రత్యేక స్ట్రాటెజీని ఫాలో అవుతుంటాడు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో మోదీ సర్కార్‌పై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతుంటాడు.

Prakash Raj : మహేష్ బాబు సినిమాలో ఆ పాత్రని నచ్చకుండానే చేయాల్సి వచ్చింది..

అయితే తాజాగా, ప్రకాశ్ రాజ్ తమిళ యంగ్ హీరో విశాల్ చేసిన ఓ కామెంట్‌కు సెటైరిక్ కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల కాశీ వెళ్లిన విశాల్, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని.. మోదీ ప్రభుత్వం అక్కడ చేపడుతున్న అభివృద్ధికి తాను వీరాభిమానిని అయ్యానంటూ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తాజాగా విశాల్ చేసిన ఈ కామెంట్‌పై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు.

Hero Vishal: విశాల్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హై‌కోర్ట్.. ఆస్తుల వివరాలు చెప్పాలి!

విశాల్ చేసిన కామెంట్స్‌పై ‘‘షాట్ ఓకే.. నెక్ట్స్..?’’ అంటూ సెటైరిక్ కామెంట్ చేశాడు. మోదీ ప్రభుత్వంపై విశాల్ చేస్తున్న భజనకు సంబంధించిన షాట్ ఓకే అని.. తరువాత ఏం చేయబోతున్నారంటూ విశాల్‌పై మండిపడ్డాడు ప్రకాశ్ రాజ్. ప్రస్తుతం వీరిద్ధరి మధ్య నడుస్తున్న ఈ ట్వీట్ వార్‌పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిసారి మోదీని విమర్శించే పనిలోనే ప్రకాశ్ రాజ్ ఉన్నాడని.. దమ్ముంటే ఆయన కూడా ఎన్నికల్లో నిల్చొని ప్రజలకు ఏదైనా చేయాలని పలువురు విమర్శిస్తున్నారు. మరికొంత మంది ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రకాశ్ రాజ్ కౌంటర్‌కు విశాల్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.