Prakash Raj: ‘నా రాజీనామా వెనక పెద్ద విషయం ఉంది.. త్వరలోనే అన్నీ చెబుతా’

ప్రకాశ్ రాజ్ మాత్రం మెట్టు దిగడం లేదు. మా సభ్యత్వానికి తన రాజీనామా నిర్ణయం వెనక లోతైన అర్థం ఉందని ఆయన ట్వీట్ చేశారు.

Prakash Raj: ‘నా రాజీనామా వెనక పెద్ద విషయం ఉంది.. త్వరలోనే అన్నీ చెబుతా’

Prakash Raj

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. ప్రకాశ్ రాజ్ చాలా సీరియస్ గా ఉన్నారు. మంచు విష్ణు కౌగిలించుకున్నా.. ఐ లవ్ యూ చెప్పినా.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయవద్దని కోరుతున్నా.. వచ్చి కలిసి మాట్లాడతానని అంటున్నా.. ప్రకాశ్ రాజ్ మాత్రం మెట్టు దిగడం లేదు. తన రాజీనామా నిర్ణయం వెనక లోతైన అర్థం ఉందని ఆయన ట్వీట్ చేశారు.

ఇన్నాళ్లుగా తనకు అండగా ఉన్నవారికి ప్రకాశ్ రాజ్ ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని కూడా ట్వీట్ లో చెప్పారు. అన్ని విషయాలపై త్వరలో మాట్లాడతానని.. తనకు అండగా ఉన్నవారు గర్వంగా తలెత్తుకున్నా నడుచుకుంటానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

తనను తెలుగు వాడు కాదంటూ.. మంచు విష్ణు ప్యానెల్ కు అండగా నిలిచిన వాళ్లంతా కామెంట్ చేయడం.. ప్రకాశ్ రాజ్ ను బాధించింది. అదే విషయాన్ని.. మా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు మీడియా సమావేశంలో ప్రకాశ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి చోట.. తనకు సభ్యత్వం కూడా వద్దంటూ.. మా.. కు రాజీనామా చేసేశారు. తన సీరియస్ నెస్ ను.. తాజా ట్వీట్ తో కంటిన్యూ చేశారు. త్వరలోనే అన్నీ చెబుతా అంటున్న ప్రకాశ్.. అసలు ఏం మాట్లాడతారు.. ఎప్పుడు మాట్లాడతారు.. తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి.. అన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

Read More:

MAA Elections: మా.. సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం