Paralympicsలో దుమ్ములేపిన మనోళ్లు..! బ్యాడ్మింటన్ లో డబుల్ మెడల్స్

పారాలింపిక్స్‌లో ఇండియా ప‌త‌కాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణ పతకాలు, 7 సిల్వర్, 6 కాంస్య పతకాలు నెగ్గింది.

Paralympicsలో దుమ్ములేపిన మనోళ్లు..! బ్యాడ్మింటన్ లో డబుల్ మెడల్స్

Pramod Bhagat Manoj Sarkar

Pramod Bhagat – Manoj Sarkar : టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు భారత షట్లర్ ప్రమోద్ భగత్. మెన్స్ సింగిల్స్ SL3 ఈవెంట్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో… గ్రేట్ బ్రిటన్ కు చెందిన డేనియెల్ బెతెల్ ను ఓడించాడు. మరోవైపు.. ఇదే కేటగిరీలో జపాన్ షట్లర్ డైసుకే ఫుజిహరాను ఓడించిన ఇండియా ప్లేయర్ మనోజ్ సర్కార్ బ్రాంజ్ మెడల్ గెల్చుకున్నాడు.

బ్యాడ్మింటన్ లో ఒకేరోజు గోల్డ్, కాంస్య పతకాలు సాధించి పెట్టిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు బ్యాడ్మింటన్ వరల్డ్ తో పాటు… పొలిటికల్, సినిమా, ఇండస్ట్రియలిస్ట్ ప్రముఖులు మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పారాలింపిక్స్ లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించారని ప్రశంసించారు. భారత బ్యాడ్మింటన్ లో సువర్ణాధ్యాయం లిఖించారని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు

పారాలింపిక్స్‌లో ఇండియాకు ఇవాళ సెప్టెంబర్ 4 ఉదయం మ‌రో రెండు మెడ‌ల్స్ ద‌క్కాయి. భారత్‌ ఖాతాలో ఈ ఉదయం ఓ స్వర్ణం, ఓ రజతం చేరాయి. షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్ గోల్డ్‌ మెడ‌ల్ గెలిచాడు. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నీశ్ అద్భుత ప్రద‌ర్శన ఇచ్చాడు. టాప్‌లో నిలిచిన అత‌ను స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఇదే ఈవెంట్‌లో సింఘ‌రాజ్‌కు సిల్వర్ మెడ‌ల్ ద‌క్కంది.

పారాలింపిక్స్‌లో ఇండియా ప‌త‌కాల సంఖ్య 17కు చేరింది. మ‌హిళ‌ల షూటింగ్ ఈవెంట్‌లో అవ‌నిలేఖరా ఇప్పటికే రెండు మెడ‌ల్స్ సాధించింది. దీంతో ఒక షూటింగ్‌ నుంచే భారత్‌ ఖాతాలో నాలుగు మెడల్స్‌ వచ్చినట్లయింది. ఇందులో ఏకంగా రెండు గోల్డ్‌ మెడల్స్‌ ఉన్నాయి. ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ 4 స్వర్ణ పతకాలు గెల్చుకుంది. 7 సిల్వర్, 6 కాంస్య పతకాలు నెగ్గింది.