Pranitha : నేను, నా భర్త ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి ఏడ్చేశాం..

తాజాగా 'ది కశ్మీర్‌ ఫైల్స్' సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'ది కశ్మీర్‌ ఫైల్స్' సినిమా గురించి ప్రణీత.........

Pranitha : నేను, నా భర్త ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి ఏడ్చేశాం..

Pranitha

 

The Kashmir files :  కశ్మీర్ లో హిందువులపై, కాశ్మీర్ పండిట్లపై 1980-90 దశకంలో జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల మార్చ్ 11న ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి మంచి కలెక్షన్లని రాబడుతుంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్’. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

ఈ సినిమా ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టిస్తోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన వారంతా థియేటర్లలోంచి కన్నీళ్లతో బయటకి వస్తున్నారు. నరేంద్ర మోడీ, అద్వానీతో సహా సెలబ్రిటీలు సైతం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని చూసి డైరెక్టర్, చిత్ర యూనిట్ లను అభినందిస్తున్నారు. సెలబ్రిటీలు ఈ సినిమా గురించి అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కన్నడ భామ ప్రణీత పోస్ట్ చేసింది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

తెలుగులో ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలతో అలరించిన కన్నడ భామ ప్రస్తుతం పెళ్లి చేసుకొని అడపాదడపా సినిమాలు చేస్తుంది. సేవా కార్యక్రమాలలో, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది ప్రణీత. తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా గురించి ప్రణీత.. ”మేము ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా చూశాము. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ పండిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది” అంటూ పోస్ట్ చేసింది.