DK Aruna On PK : సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే హస్తం-డీకే అరుణ సంచలనం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)

DK Aruna On PK : సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే హస్తం-డీకే అరుణ సంచలనం

Dk Aruna On Pk

DK Aruna : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం టీఆర్ఎస్ కుట్రే అని ఆమె ఆరోపించారు. అమాయకుడైన ఆర్మీ అభ్యర్థిని టీఆర్ఎస్ పొట్టన పెట్టుకుందని ఆమె వాపోయారు.

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై స్పందించిన డీకే అరుణ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామన్నారు. పెద్దఎత్తున అల్లర్లు జరగనున్నాయనే సమాచారాన్ని మందుగానే తెలుసుకోకుండా నిఘా విభాగం ఏం చేస్తోందని డీకే అరుణ ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయని నిలదీశారు. ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు జరిగాయని డీకే అరుణ ఆరోపించారు.(DK Aruna On PK)

Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

”రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండొచ్చు. రైల్వే స్టేషన్ లో అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరతాం. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? నిన్న జరిగిన ఘటన ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని” డీకే అరుణ ఆరోపించారు.

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంపై పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడెమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడెమీల్లోనే కొంతమంది.. నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడెమీలు సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు తేల్చారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానం అగ్గి రాజేసింది. తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది.(DK Aruna On PK)