Prathani Ramakrishna Goud : నిర్మాతలకు తమ సినిమాల్ని తాము అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి… ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు..

తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''నిర్మాతలకు తమ సినిమాల్ని తామే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. వారిపై ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు. సినిమా రిలీజ్‌కు............

Prathani Ramakrishna Goud : నిర్మాతలకు తమ సినిమాల్ని తాము అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి… ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు..

prathani ramakrishna goud

Prathani Ramakrishna Goud :  ఇటీవల టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి.. ఇలా పలు సంస్థలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఆ సమస్యలకి పరిష్కారాల కోసం చర్చలు చేస్తున్నారు. ఒక సంస్థలా ఉండి అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలి, అందరికి ఒకేలా ఉండాలి నిర్ణయాలు అని ఆలోచనలు చేస్తున్నారు. అందరూ అసోషియేషన్స్ చెప్పినట్టు, వారు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడేలా వ్యవహరించాలని భావిస్తున్నారు.

అయితే నిర్మాతల విషయంలో అసోసియేషన్స్ తీసుకునే నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌. అంతకు ముందు కూడా షూటింగ్స్ నిలుపుదల నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఈయన. సినిమాలు ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి రావాలి అనే దానిపై కూడా ఛాంబర్ నిర్ణయం తీసుకోనుంది.

Bimbisara Rap Song: బింబిసార ర్యాప్ సాంగ్.. మామూలుగా లేదుగా!

తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ”నిర్మాతలకు తమ సినిమాల్ని తామే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. వారిపై ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు. సినిమా రిలీజ్‌కు థియేటర్స్‌ కూడా పర్సెంటేజ్‌ విధానంలో ఇవ్వాలి. ప్రస్తుతం భారత్‌లో ఓటీటీల హవా నడుస్తోంది. ఇండస్ట్రీలో స్తబ్దత ఉంది. నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న వాటితో నేను ఏకీభవించను. నిర్మాత తన సినిమాని ఎప్పుడు అమ్మాలో తనే నిర్ణయించుకోవాలి తప్ప ఏ అసోసియోషనో, మరో సంస్థో చెప్పడం కరెక్ట్‌ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్‌ ఎలాగో ఇవ్వరు, ఓటీటీలో అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వమంటే ఎలా” అన్నారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.