Pregnant Heroins: యాహూ నేను ప్రెగ్నెంట్.. ఓపెన్‌గా చెప్పేస్తున్న హీరోయిన్స్!

లైమ్ లైట్లో ఉన్నప్పుడు వరస పెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. అప్పుడప్పుడు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు.

Pregnant Heroins: యాహూ నేను ప్రెగ్నెంట్.. ఓపెన్‌గా చెప్పేస్తున్న హీరోయిన్స్!

Pregnant Heroins

Pregnant Heroins: లైమ్ లైట్లో ఉన్నప్పుడు వరస పెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. అప్పుడప్పుడు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. సినిమాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఏదోక న్యూస్ తో ఎంగేజ్ చేస్తున్నారు. అయితే ఈమధ్య మాత్రం హీరోయిన్లు వరస పెట్టి గుడ్ న్యూస్ లు చెబుతున్నారు.

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫొటోషూట్

మొన్నీమధ్య వరకూ వరసగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఫుల్ గా చిల్ అవుతున్నారు. పెళ్లి చేసుకుని బెస్ట్ భార్యగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ప్రమోషన్ తెచ్చుకుని తల్లిగా మారుతూ సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ లు పోస్ట్ చేస్తున్నారు. అత్తారింటికి దారేదితో అందరికీ కనెక్ట్ అయన ప్రణీత.. నేను తల్లినయ్యాను అంటూ పోస్ట్ పెట్టింది. లాస్ట్ ఇయర్ నితిన్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లిచేసుకున్న ప్రణీత.. దేవుడు మాకు గిఫ్ట్ పంపించాడు అంటూ సోషళ్ మీడియలో పిక్స్ పోస్ట్ చేసింది.

Pranitha Subhash : తల్లి కాబోతున్న హీరోయిన్.. దేవుడి బహుమతి అంటూ అధికారికంగా పోస్ట్..

సౌత్ లో స్టార్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ కూడా తన ఫ్రెండ్ అయిన గౌతమ్ ని పెళ్లి చేసుకుంది. పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నారు కాజల్ జంట. తన ప్రెగ్నెన్సీని ఎంత ఓపెన్ గా అనౌన్స్ చేసిందో.. అంతే ఓపెన్ గా తన మెటర్నిటీ ఎక్సర్ సైజెస్ తో పాటు బేబీ బంప్ ఫోటో షూట్స్ ని కూడా సోషల్ మీడియాలో ఫాన్స్ తో పంచుకుంటోంది. అంతేకాదు.. తమకు పుట్టబోయే బేబీ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నామంటూ ఎప్పటికప్పుడు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటోంది కాజల్.

Sanjana : హీరోయిన్ సంజనకి అశ్లీల సందేశాలు పంపిన ఫొటోగ్రాఫర్.. అరెస్ట్

బుజ్జిగాడు సినిమాతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన హీరోయిన్ సంజన కూడా ఆమధ్య గుడ్ న్యూస్ షేర్ చేసింది. తల్లి కాబోతున్నానంటూ ఫాన్స్ తో తన ఆనందాన్ని పంచుకుంది. అంతే కాదు ప్రెగ్నెన్సీ విమెన్ ఎలాంటి యోగా చెయ్యాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అంటూ బేబీ బంప్ తో రకరకాల వీడియో స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తోంది సంజన.

Sonam Kapoor : ప్రెగ్నెంట్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు

సౌత్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా తన ప్రెగ్నెన్సీ ని రీసెంట్ గానే అనౌన్స్ చేసింది. ఆనంద్ ఆహుజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్ కూడా తన ప్రెగ్నెన్సీని ఎగ్జైటెడ్ గా షేర్ చేసుకుంది. అంతేకాదు.. తన బేబీ బంప్ తో ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతోంది. లేటెస్ట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫోటో షూట్ కూడా చేయించుకుంది సోనమ్ కపూర్.