Pregnant Women : గర్భిణీలు…ఆహారం విషయంలో జాగ్రత్త!…

గర్భధారణ సమయంలో స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.

Pregnant Women : గర్భిణీలు…ఆహారం విషయంలో జాగ్రత్త!…

Pregnant (1)

Pregnant Women : గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రతలు పాటించాలి. పండంటి బిడ్డ కోసం తినే ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఏవి తినాలి, ఏవి తినకూడదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం విషయంలో వైద్యులను సంప్రదించి వారి సూచనలు , సలహాలు తప్పకుండా తీసుకోవాలి.

గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు అవసరమైన మేర ఆహారాన్ని కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, కర్జూరం, ద్రాక్ష , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి.

ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవడం మంచిది. ఇవి ఎక్కువగా ఆపిల్, జామ. పీచ్, బెర్రీస్ మొదలైన వాటిలో ఉంటాయి. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి. పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. అయితే కొన్ని ఆహారపదార్ధాలను తినటం ఏమంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం అనుకోకుండా అబార్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

తినకూడని ఆహారాలు…

గర్భధారణ సమయంలో స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో సాల్మోనెల్లా అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ. పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు. పాచ్యురైజేషన్‌ చేయని పాలలో లిస్టీరియా , బొవినీటిబి అనే బాక్టీరియా ఉంటుంది.

జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి లాభం ఉండదు. ఇంకా జంక్ ఫుడ్ సమస్యలు కలిగిస్తాయి. రిఫైన్డ్ చేసిన పిండి, ప్రొసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానువకోవటం మంచిది. రోజుకు 300 గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకండి. కూల్ డ్రింక్ లను తాగకుండా ఉండండి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. ఇలా తీసుకోవటం వల్ల ఊపిరి అడక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.