Prem Chopra : బతికుండగానే నన్ను చంపేశారు, దీన్నే శాడిజం అంటారు-నటుడి తీవ్ర ఆవేదన

ఓ సీనియర్‌ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకుని ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Prem Chopra : బతికుండగానే నన్ను చంపేశారు, దీన్నే శాడిజం అంటారు-నటుడి తీవ్ర ఆవేదన

Prem Chopra

Prem Chopra : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని విషయాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. క్షణాల వ్యవధిలోనే సమాచారం అందరికీ చేరిపోతోంది. వైరల్ గా మారుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సోషల్ మీడియా కారణంగా తప్పిదాలు జరిగిపోతున్నాయి. సోషల్ మీడియా కారణంగా అసత్యపు ప్రచారాలు వేగంగా స్ప్రెడ్ అయిపోతున్నాయి.

ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. ఫేక్ న్యూస్ కూడా ఇట్టే వైరల్ అయిపోతోంది. అది ఫేక్ అని తెలిసే లోపే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మరీ ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన వారి విషయంలో సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెలెబ్రిటీలకు సోషల్‌ మీడియా తెచ్చే తంటాలు అన్నీఇన్నీ కావు. బతికుండగానే.. సోషల్ మీడియా వారిని చంపేస్తోంది. గతంలో పలువురి విషయంలో ఇది జరిగింది. తాజాగా మరో సీనియర్ నటుడికి అలాంటి చేదు అనుభవం ఎదురైంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తాజాగా ఓ సీనియర్‌ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకుని ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన చేశారు.

జూలై 27న తాను చనిపోయానంటూ న్యూస్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రేమ్ చోప్రా(87) మండిపడ్డారు. ” నన్ను బతికుండానే చంపేస్తున్నారు. ఇక నేను లేనంటూ పుకారు లేపి రాక్షాసానందం పొందుతున్నారు. దీన్నే శాడిజం అంటారు.

RIP : బతికుండగానే చావు వార్తలు చదువుకున్న వేణుమాధవ్

నేను చనిపోయాను అంటూ ఎవరు ఇలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మిత్రులంతా ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు, గతంలో నా ఆప్తమిత్రుడు జితేంద్ర కూడా మరణించాడంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి’ అని చెప్పుకొచ్చాడు” అని ప్రేమ్ చోప్రా వాపోయారు. ప్రేమ్ చోప్రా 380కిపైగా సినిమాల్లో నటించారు. దోస్తానా, క్రాంతి, జాన్వర్‌, షాహీద్‌, ఉపకార్‌, పురబ్‌ ఔర్‌ పశ్చిమ్‌, దో రాస్తే, కటి పతంగ్‌, దో అంజానే, జాదు తోనా, కల సోనా వంటి పలు సినిమాల్లో ఆయన అలరించారు.

చనిపోయాడనుకుని అంత్యక్రియలు పూర్తి చేస్తే తిరిగొచ్చాడు

ప్రేమ్‌ చోప్రా, ఆయన భార్య ఉమ ఇద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్‌ బారిన పడటంతో ముంబై ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్‌ అయ్యారు.