Red ANnt Chutney : ఎర్ర చీమల చట్నీకి యమా డిమాండ్..! జీఐ ట్యాగ్‌ కోసం యత్నాలు..

చీమల పచ్చడి. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్లోనూ, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్‌ ఉంది. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్‌ డా అని పిలుస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.ఈ చట్నీ మన శరీరానికి ఓ ఔషధంగానూ పని చేస్తుందట. అందుకే దీనికి జీఐ ట్యాగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Red ANnt Chutney : ఎర్ర చీమల చట్నీకి యమా డిమాండ్..! జీఐ ట్యాగ్‌ కోసం యత్నాలు..

Red Annt Chutney (1)

Red ANnt Chutney : ఉప్మా పెసరట్టుతో అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్‌.. ఇడ్లీతో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అదిరిపోయే కాంబినేషన్‌.. పొంగిన పూరీలోకి బొంబాయి చట్నీ కేక పుట్టిస్తుంది. మరీ చీమల చట్నీ ఎందులోకి బాగుంటుందో తెలుసా..! అది ఎందులోకైనా పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. మీరు కరెక్ట్‌గానే విన్నారు.. అది చీమల చట్నీయే..! ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎర్రచీమల చట్నీ బాగా ఫేమస్.ఈ చట్నీ మన శరీరానికి ఓ ఔషధంగానూ పని చేస్తుందట. అందుకే దీనికి జీఐ ట్యాగ్‌ కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్ర చీమల చట్నీ జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు మరియు ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని కేంద్రానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త దీపక్ మొహంతి తెలిపారు.

మన రోజువారీ జీవన విధానంలో అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో చేసిన చట్నీలు తింటూనే ఉంటాం. నాన్‌ వెజ్ పచ్చళ్లూ ఆరగించే ఉంటాం. అయితే ఇప్పుడు చూడబోయే ఓ పచ్చడి మాత్రం ఎప్పుడూ తిని ఉండరు. కనీసం అలాంటి ఓ చట్నీ గురించి వినే ఉండరు. అదే చీమల పచ్చడి. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్లోనూ, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్‌ ఉంది. మనమైతే చీమల్ని చూడగానే..దూరం జరగడం కానీ, ఊడ్చేయడం గానీ చేస్తుంటాం. కానీ గిరిజనులు మాత్రం చీమల్ని చూడగానే పండుగ చేసుకుంటారు. వెంటనే వాటిని సేకరించి పచ్చడి చేసేసుకుంటారు. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్‌ డా అని పిలుస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.

మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోని సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలు గూళ్లు పెడతాయి. స్థానిక గిరిజనులు ఆ చెట్లెక్కి, ఈ చీమలను సేకరిస్తారు. ఈ చట్నీ తయారుచేసేందుకు ముందుగా వాటిని రుబ్బుతారు. ఆ పేస్ట్‌కు ఉప్పు, కారం కలిపితే చట్నీ సిద్ధమవుతుంది. కొందరు అల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. అక్కడి వారంతా ఈ చీమల చట్నీని ఎంతో ఇష్టంగా తింటారు. నిజానికి కీటకాలను తినే అలవాటు తరాల నుంచీ ఉంది. ప్రజల్లో ఆధునికత పెరిగేకొద్దీ కొన్నికొన్ని ఆహారాలు, అలవాట్లు దూరం అవుతున్నాయి. తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివాటిని ఒకప్పుడు లొట్టలేసుకొని తినేవారట. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అవే తింటుంటారు. ఇది వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా.. ఇదే నిజం. ఆ కోవకు చెందినదే ఈ చీమల చట్నీ కూడా…!

దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చీమల పచ్చడిని బస్తరియా చట్నీ పేరుతో వడ్డిస్తారు. జగదల్‌పూర్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పర్యటకుల కోసం ఈ పచ్చడి అందుబాటులో ఉంటుంది. ఇక దీన్ని తినడానికి ప్రధాన కారణం.. ఇందులో పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్‌ యాసిడ్ ఉంటుంది. ప్రొటీన్, కాల్షియం కూడా ఉండడం వల్ల చీమలు మలేరియా, కామెర్లు చికిత్సలోనూ ఉపయోగపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు చీమల్లో ఉంటాయి. అందుకే శరీర ఆరోగ్యానికి ఈ చట్నీ చాలా మంచిదని… కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనులు నమ్ముతారు.

ఇప్పుడు ఈ చీమల చట్నీకి జీఐ ట్యాగ్‌ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం ఓ ప్రజెంటేషన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చీమల చట్నీకి సంబంధించి ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. చీమలచట్నీకి జీఐ ట్యాగ్‌ వస్తే ఇక వరల్డ్‌ వైడ్‌ ఫేమస్ అయిపోతుంది. నిజానికి ఈ చీమలచట్నీ తినేది మనదేశంలోని గిరిజన ప్రాంతాల వారే కాదు. కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు.