ఆర్ఆర్ఆర్: భీమ్ ప్రేయసి జెన్నిఫర్..

ఆర్ఆర్ఆర్: భీమ్ ప్రేయసి జెన్నిఫర్..

Olivia Morris: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినప్పటి నుండి టీమ్ వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. శుక్రవారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేయసిగా నటిస్తున్న హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ లుక్ రిలీజ్ చేశారు. ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు.

https://10tv.in/rrr-movie-in-theatres-from-october-13-2021/

‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ గర్ల్ ఫ్రెండ్ జెన్నిఫర్ క్యారెక్టర్‌లో కనిపించనుంది ఒలీవియా.. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. రిలీజ్ డేట్‌తో చరణ్ గుర్రంపై, తారక్ బుల్లెట్‌పై వెళ్తున్న పోస్టర్ వదలగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.

Olivia Morris