PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్‌ పర్యటన

ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్‌లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్‌ పర్యటన

Pm Modi (1)

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఎల్లుండి జపాన్‌లో పర్యటించనున్నారు. ఎల్లుండి టోక్యోలో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై ఆయా దేశాల అధ్యక్షులతో సమాలోచనలు జరపనున్నారు.

ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్‌లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత పరిణామాలు, సమకాలీన అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్‌ దేశాల ఉమ్మడి అంశాలపై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తారు.

Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

క్వాడ్ నేతల మధ్య జరిగే నాలుగో భేటీ ఇది. గత ఏడాది మార్చిలో నాలుగు దేశాల అధ్యక్షులు తొలిసారి వర్చువల్​గా సమావేశమయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో వాషింగ్టన్​లో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఈ ఏడాది మార్చిలో మూడోసారి నాలుగు దేశాల అధినేతలు వర్చువల్​గా సమావేశమై చర్చలు జరిపారు.

ఇప్పుడు జరిగే జపాన్‌లో సమావేశం నాల్గవ భేటీ ప్రత్యక్షంగా జరుగనుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ 40 గంటల జపాన్‌ పర్యటనలో 23 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో కూడా సమావేశమయ్యే అవకాశముంది.