Viral Video: అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని ఆపిన ప్రధాని మోదీ

అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని ఆపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీంతో అంబులెన్సు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయింది. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధాని మోదీ కాంగ్డా జిల్లాకు వెళ్తున్నారు. చాంబీ ప్రాంతం మీదుగా మోదీ కాన్వాయ్ వెళ్తుంది. మోదీని చూసేందుకు చాలా మంది వచ్చారు. ఆ సమయంలో మోదీకి ఓ అంబులెన్స్ కనపడింది. దీంతో తన కాన్వాయ్ ను ఆపించి, అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇచ్చారు మోదీ.

Viral Video: అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని ఆపిన ప్రధాని మోదీ

Viral Video: అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని ఆపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీంతో అంబులెన్సు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయింది. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధాని మోదీ కాంగ్డా జిల్లాకు వెళ్తున్నారు. చాంబీ ప్రాంతం మీదుగా మోదీ కాన్వాయ్ వెళ్తుంది.

మోదీని చూసేందుకు చాలా మంది వచ్చారు. ఆ సమయంలో మోదీకి ఓ అంబులెన్స్ కనపడింది. దీంతో తన కాన్వాయ్ ను ఆపించి, అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇచ్చారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలని అన్నారు.

అస్థిరత, అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో హిమాచల్ ప్రదేశ్ ను మోసం చేసిందని అన్నారు. అభివృద్ధికి శత్రువులా కాంగ్రెస్ ఉందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండడం తప్పనిసరి వ్యాఖ్యానించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..