Salaar: ‘సలార్’పై పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మామూలుగా లేదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. తాజాగా సలార్ మూవీ గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

Salaar: ‘సలార్’పై పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మామూలుగా లేదట!

Prithviraj Sukumaran Comments On Salaar Movie

Salaar: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ప్రభాస్‌ను చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో ఈ సినిమాలో ప్రెజెంట్ చేస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Salaar: ఆదిపురుష్ దెబ్బ ‘సలార్’కు కూడా తగలనుందా..?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సలార్’ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయిన పృథ్వీరాజ్, తాజాగా సలార్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామంట్స్ చేశారు.

Salaar: రాధేశ్యామ్, సాహోలో లేనిది ‘సలార్’లో చూపిస్తున్న ప్రభాస్!

ప్రశాంత్ నీల్ విజన్‌కు, ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్న తీరుకు తాను ఫిదా అయ్యానని పృథ్వీరాజ్ తెలిపాడు. ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. ఈ సినిమా చిన్న సినిమా కాదని, తాను అనుకున్న దానికంటే చాలా భారీ స్థాయిలో ఉంటుందని ఆయన తెలిపారు. స్క్రిప్టు పరంగా కూడా సలార్ అల్టిమేట్ మూవీ అని ఆయన పేర్కొన్నారు. ఇక సలార్ సినిమాపై పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.