Puducherry : ఏసీ హెల్మెట్లు వచ్చేసాయ్.. ఇక తలపై చల్ల చల్లగా ..

హెల్మెట్ ధరించడం కంపల్సరీ అయినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. తలపై బరువుగా ఉందని.. ఎండలో చమటలకు తట్టుకోలేక మరికొందరు అవాయిడ్ చేస్తుంటారు. చలాను కట్టడానికి కూడా కొందరు వెనుకాడరు. అయితే ఇప్పుడు తలపై చల్ల.. చల్లగా కూల్ కూల్ ఏసీ హెల్మెట్లు వచ్చేస్తున్నాయ్. తెలంగాణ కంపెనీ పుదుచ్చేరిలో తమ కంపెనీ ఏసీ హెల్మెట్లను పరిచయం చేస్తోంది. త్వరలో అన్నిచోట్ల ఇవి అందుబాటులోకి వస్తాయట.

Puducherry : ఏసీ హెల్మెట్లు వచ్చేసాయ్.. ఇక తలపై చల్ల చల్లగా ..

Puducherry

Puducherry – AC helmet : హెల్మెట్ ధరించాలనే నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉంది. ధరించని వారికి చలాన్లు పడుతూనే ఉన్నాయి. ప్రమాద సమయంలో రక్షణ కవచంలా పనిచేసే హెల్మెట్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ కంపల్సరీ అయ్యింది. రీసెంట్‌గా అక్కడ ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఎండ వేడి తట్టుకోలేక హెల్మెట్ ధరించని వారికోసం ఏసీ హెల్మెట్లు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఓ కంపెనీ  ఏసీ హెల్మెట్‌ను తయారు చేశారు. మొదటిసారిగా అక్కడ పరిచయం చేసారు.

Dog wearing helmet : హెల్మెట్ పెట్టుకోని వాళ్లు ఈ వీడియో చూసైనా మారండి

పుదుచ్చేరిలో తాజాగా హెల్మెట్ కంపల్సరీ అయ్యింది. హెల్మెట్ ధరించకపోతే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దాంతో అక్కడ హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరిగింది. తలపై బరువు, చమటలతో చాలామంది హెల్మెట్ ధరించడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి తెలంగాణకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీ హెల్మెట్ల తయారీ మొదలుపెట్టింది. ఈ హెల్మెట్లను ఆ రాష్ట్ర హోం మంత్రి నమశ్శివాయం పరిశీలించారు. ఈ ఏసీ హెల్మెట్ విక్రయాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

helmetless cops : హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన మహిళా పోలీసులు ఫోటో వైరల్

మొత్తానికి ఈ రకంగా అయినా హెల్మెట్ల వాడకం పెరగడం.. జనంలో అవగాహన రావడం జరుగుతుందని అనిపిస్తోంది. ఈ ఏసీ హెల్మెట్లు త్వరలోనే అన్నిచోట్ల అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.