Pushpa2: ‘పుష్ప2’లో విజయ్ సేతుపతికి జోడీ దొరికిందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్న ‘పుష్ప-2’ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో ఆయనకు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉంటుందట.

Pushpa2: ‘పుష్ప2’లో విజయ్ సేతుపతికి జోడీ దొరికిందా..?

Priyamani As Wife Of Vijay Sethupathi In Pushpa 2

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ ఊరమాస్ మూవీలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అయినా, మాస్ అంశాలను పుష్కలంగా చూపెట్టాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమా సాధించిన రికార్డులతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పుష్ప టీమ్ బిజీగా ఉన్నారు.

Pushpa2: పుష్ప రాజ్ కోసం కష్టపడుతున్న బుచ్చిబాబు

ఇప్పటికే పుష్ప పార్ట్ 2 ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈసారి పుష్ప2 సినిమాలో మరికొంత మంది స్టార్స్ జాయిన్ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి. నిజానికి ఆయన్ను పుష్ప తొలిభాగంలోనే తీసుకోవాలని సుకుమార్ ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో విజయ్ సేతుపతి బిజీ షెడ్యూల్స్ వల్ల అది కుదర్లేదు. దీంతో ఇప్పుడు రెండో పార్ట్‌లో ఖచ్చితంగా విజయ్ సేతుపతి నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Pushpa2: ఏందిరా సామీ.. ఎక్కడ దొరుకుతాయి మీకు అంటోన్న మనోజ్!

కాగా, ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. ఆయనకు ఈ సినిమాలో జోడీ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సేతుపతి లాంటి యాక్టర్‌కు ఎవర్ని జోడీగా తీసుకుంటారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. నటి ప్రియమణి అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావించిన సుక్కు, ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇలాంటి వర్సటైల్ యాక్టర్స్‌ను పుష్ప2లో తీసుకుంటుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.