Priyanka Jawalkar : మీరు రాసిన ఆర్టికల్స్ చదివి మా అమ్మ తిట్టింది.. ప్రియాంక జవాల్కర్ కౌంటర్ పోస్ట్..

గతంలో ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్ లోనే అందరికి తెలిసేలా ఒకరి ఫొటోలకి ఒకరు ప్రేమగా, సరదాగా కామెంట్స్ పెట్టుకునేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో..............

Priyanka Jawalkar : మీరు రాసిన ఆర్టికల్స్ చదివి మా అమ్మ తిట్టింది.. ప్రియాంక జవాల్కర్ కౌంటర్ పోస్ట్..

Priyanka Jawalkar

Priyanka Jawalkar :  హీరోయిన్స్ ఎవరితో అయినా క్లోజ్ గా తిరిగినా, క్లోజ్ గా మాట్లాడినా గాసిప్స్ ఈజీగా వస్తాయి. కొన్ని సార్లు అవి నిజాలు కూడా అవ్వొచ్చు. ఇలాంటి గాసిప్స్ విని, చూసి చాలా మంది వదిలేస్తారు. కొంతమంది వాటికి కౌంటర్లు ఇస్తారు. తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టి ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తర్వాత తిమ్మరుసు, SR కల్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ సాధించింది ప్రియాంక జవాల్కర్.

ప్రియాంక అటు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఇటీవల వరుసగా ఫొటోషూట్స్ చేసి మరీ ఫొటోలు అప్లోడ్ చేస్తుంది. గతంలో ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్ లోనే అందరికి తెలిసేలా ఒకరి ఫొటోలకి ఒకరు ప్రేమగా, సరదాగా కామెంట్స్ పెట్టుకునేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై అటు ప్రియాంక కానీ, ఇటు వెంకటేష్ కానీ స్పందించలేదు.

Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..

ఇక రీసెంట్‌గా ప్రియాంక జవాల్కర్ ఓ ఫొటో షూట్ చేసి ఫోటోలు పోస్ట్ చేయగా అందులోకొన్ని ఫోటోలలో ప్రియాంకకి ఎదురుగా ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. అయితే అతను పేస్ కనపడకుండా వెనక్కి తిరిగి కూర్చున్నాడు అంతే కాక బ్లర్‌లో ఉన్నాడు. దీంతో చాలా సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ అతను వెంకటేష్ అయ్యర్ అని, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫొటోలు దిగుతుందని వార్తలు రాశాయి. తాజాగా దీనిపై ప్రియాంక స్పందించింది. ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. ”మీరు రాసిన ఆర్టికల్స్ చూసి మా అమ్మ నన్ను తిడుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. అతను ఫోటో షూట్ లో వర్క్ చేయడానికి వచ్చిన ఒక పర్సన్, నాకు వర్క్ గురించి చెప్తున్నాడు” అని పోస్ట్ చేసింది. దీంతో అలాంటి వార్తలు రాసిన వాళ్ళకి కౌంటర్ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్.